శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 23, 2020 , 00:42:23

రియాక్టర్‌ పేలి యువశాస్త్రవేత్త సజీవదహనం

రియాక్టర్‌ పేలి యువశాస్త్రవేత్త సజీవదహనం

బొల్లారం: పరిశ్రమలో రియాక్టర్‌ పేలిన ప్రమాదంలో ఓ యువ శాస్త్రవేత్త సజీవ దహనమయ్యాడు. ఈ ఘట న సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామికవాడలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత పీఅండ్‌ఎం లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో పరిశ్రమకు చెందిన ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బొల్లారం పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టేందుకు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పరిశ్రమలోకి వెళ్లారు. స్లాబ్‌ కింద పడిఉన్న ఒక మృతదేహాన్ని కనుగొన్నారు. మృతుడు సంగారెడ్డి పట్టణానికి చెందిన అబ్దుల్‌ జబ్బార్‌(38)గా గుర్తించారు. మృతుడు ఆర్‌అండ్‌డీ శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. 



logo