సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 01, 2020 , 11:38:28

సిద్దిపేటలో రేషన్ బియ్యం పంపిణీ షురూ..

సిద్దిపేటలో రేషన్ బియ్యం పంపిణీ షురూ..

సిద్దిపేట: లాక్ డౌన్ సందర్భంగా తెలంగాణ ప్రజలు, రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర ప్రాంతాల వారు ఆకలితో అలమటించకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెల్ల రేషన్ కార్డుదారుల్లో ప్రతీ ఒక్కరికీ 12 కిలోల రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భారత్ నగర్ లో రేషన్ బియ్యం పంపిణీని జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్ ప్రారంభించారు.

కరోనా ను అరికట్టేందుకు పట్ణణ వాసులు స్వచ్చందంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.రేషన్ దారులు నిర్దేశించిన ప్రదేశాల్లో క్రమశిక్షణతో నిలబడి రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. పోలీసులు, అధికారులు దగ్గరుండి పరిస్థితులను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo