గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 30, 2020 , 19:20:47

పేదలకు రేపటిన్నుంచి బియ్యం, ఎల్లుండి నుంచి నగదు

పేదలకు రేపటిన్నుంచి బియ్యం, ఎల్లుండి నుంచి నగదు

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాలకు రేపట్నుంచి ఉచిత బియ్యంను పంపిణీ చేయనున్నారు. క్రితం నెలవలె తిరిగి ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా రూ. 1500 సాయం మే 2వ తేదీ నుంచి పౌరసరఫరాలశాఖ లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. లబ్దిదారులు సామాజిక దూరాన్ని పాటిస్తూ టోకెన్‌లో ఇచ్చిన నిర్దేశిత సమయంలోనే రేషన్‌ తీసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రతి రేషన్‌ దుకాణం దగ్గర సబ్బు, శానిటైజర్‌, నీళ్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ రేషన్‌ ఇచ్చే వరకు రేషన్‌ షాపులు తెరిచే ఉంటాయన్నారు.


logo