మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 20:44:12

నయన మనోహరం రథంగుట్ట జలపాతం

నయన మనోహరం రథంగుట్ట జలపాతం

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని మణుగూరు మండలంలో గల రథంగుట్ట జలపాతం నయన మనోహరంగా కన్పిస్తోంది. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మండలంలోని పీవీ కాలనీ క్రాస్‌ రోడ్డు శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం సమీపంలోని అడవిలో ఈ రథంగుట్ట జలపాతం ఉంది. సుమారు 30 అడుగుల ఎత్తున ఉన్న గుట్టపై నుంచి వాన నీరు పడుతోంది. జాలువారుతున్న జలపాతం ఆకట్టుకుంటుండడంతో మణుగూరు పరిసర ప్రాంతాల ప్రజలు, పర్యాటకులు అధిక సంఖ్యలో వీక్షించేందుకు  వస్తున్నారు. కొండపై నుంచి పడుతున్న నీటిలో చిన్నా పెద్దా తేడా లేకుండా జలకాలాడుతూ కేరింతలు కొడుతున్నారు.


logo