మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 07, 2020 , 15:43:30

‘జబర్దస్త్‌’గా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన రష్మీ

‘జబర్దస్త్‌’గా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన రష్మీ

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యులు.. జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు మొక్కలు నాటిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ నానక్‌రామ్‌గూడలోని తన నివాసంలో ప్రముఖ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ.. మానవాళికి కావాల్సిన ప్రాణవాయువు మొక్కలు, వృక్షాల నుంచే లభిస్తుందనీ.. కనుక ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్నారు. అడవులను సంరక్షించుకోవాలని ఈ సందర్భంగా రష్మీ తెలిపారు. కలుషితమైన కార్భన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను మొక్కలు మనకు అందిస్తాయి కనుక  ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, పర్యావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. 

ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఈ సందర్భంగా రష్మీ గౌతమ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి చారిత్రక కార్యక్రమంలో తాను భాగమవడం సంతోషంగా ఉన్నదని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా రష్మీ.. మరో ముగ్గురికి గ్రీన్‌ చాలెంజ్‌ విసిరి, మొక్కలు నాటమని విజ్ఞప్తి చేశారు. వారిలో నటుడు సత్యదేవ్‌, ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ భరద్వాజ్‌, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఉన్నారు. కాగా, గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన రష్మీని, ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. 


logo
>>>>>>