కుంటాల, ఏప్రిల్ 21 : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓల గ్రామంలో అరుదైన నటరాజ విగ్రహాన్ని గుర్తించినట్టు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవ్రా వ్ బుధవారం తెలిపారు. 10 నుంచి 11వ శతాబ్దంలో పరిపాలించిన చోళ రాజుల కాలంలో ఈ నటరాజ విగ్రహాలు రూపొందించినట్టు చెప్పారు. అభయహస్తం కలిగిన ఈ విగ్రహం స్థానిక గోవిందరాయుని చెరువు తూము వద్ద ఉన్నదని వివరించారు.