శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 01:22:17

ఇండో-అమెరికన్లకు అరుదైన గౌరవం

ఇండో-అమెరికన్లకు అరుదైన గౌరవం

  • 10 మందికి అవార్డుల ప్రకటన
  • కొవిడ్‌-19 సంక్షోభంలో సేవలు..
  • హిందూ సంస్కృతి ప్రచారానికి కృషి  చేయడం వల్లే

హ్యూస్టన్‌: ఇండో-అమెరికన్‌ యువతకు అరుదైన గౌరవం లభించింది. అమెరికాలో కష్టాల్లో ఉన్న హిందువులను ఆదుకోవడం, హిందూ సంస్కృతి సంప్రదాయాల్లోని విశిష్టతను ప్రచారంచేయడం వంటి సేవలకు గాను పది మంది ఇండో-అమెరికన్లకు అవార్డులను హిందూస్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హ్యూస్టన్‌ (హెచ్‌జీహెచ్‌) ఎన్జీవో తరుఫున అందజేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కొవిడ్‌-19 సమయంలో అమెరికాలోని హిందువులకు వైద్య సాయాన్ని అందజేయడంలో వీళ్లు కృషి చేశారని గుర్తు చేశారు. అవార్డులను అందుకున్న వారిలో అనీశ్‌ నాయక్‌ (సేవా ఇంటర్నేషనల్‌), అనూష సత్యనారాయణ్‌ (ఎటర్నల్‌ గాంధీ మ్యూజియం ఆఫ్‌ హ్యూస్టన్‌), నిత్యా రామాంకులంగరా (శ్రీ మీనాక్షి టెంపుల్‌ సొసైటీ), సందీప్‌ ప్రభాకర్‌ (గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ డివైనిటీ), కృతి పటేల్‌ (బీఏపీఎస్‌), విపచిత్‌ నందా (ఆర్య సమాజ్‌), అభిమన్యు అగర్వాల్‌ (హిందూ హెరిటేజ్‌ యూత్‌ క్యాంప్‌), రజిత్‌ షా (వల్లభ్‌ విద్యా మందిర్‌), నమితా పల్లోడ్‌ (సనాతన్‌ హిందూ ధర్మ), కోమల్‌ లుత్రా (యంగ్‌ హిందూస్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హ్యూస్టన్‌) ఉన్నారు. అవార్డులకు ఎంపికైన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. హిందూ వారసత్వాన్ని ప్రపంచం నలువైపులా తీసుకెళ్లడంలో ఈ యువతీ, యువకులు విజయం సాధించారని హెచ్‌జీహెచ్‌కు రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు. logo