సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 14:15:42

బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాపోలు పరమేష్

బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాపోలు పరమేష్

న‌ల్ల‌గొండ : బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నల్ల‌గొండ‌ జిల్లా అల్వాల ప్రాధమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రాపోలు పరమేష్  నియమితులయ్యారు.ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సుంకర శ్రీనివాస్ రావు, తాళ్లపల్లి సురేష్‌లు సోమవారం నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పరమేష్ మాట్లాడుతూ.. బీసీ ఉపాధ్యాయ సంఘం బలోపేతానికి శక్తి వంచన లేకుండ కృషి చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్‌కు ప్ర‌త్యేక‌ కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకం సందర్భంగా నల్గొండ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కొన్నే శంకర్ గౌడ్, నల్లమేకల వెంకయ్య, నిజామాబాద్ అధ్యక్షుడు వినోద్, వరంగల్ అధ్యక్షుడు ప్రవీణ్, బీరప్ప, గోపాల కృష్ణ, కోలా సైదులు ముదిరాజ్, గంగ పుత్ర సైదులు, మారం శ్రీనివాస్, వడ్డేపల్లి వెంకటేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.