శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 01:32:50

వేగంగా కొత్త ప్లాంట్ల నిర్మాణాలు

వేగంగా కొత్త ప్లాంట్ల నిర్మాణాలు

  • టీఎస్‌ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

పాల్వంచ: రాష్ట్రంలో కొత్త ప్లాంట్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతున్నాయని టీఎస్‌ జెన్‌కో, ట్రా న్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నా రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలో  800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన కేటీపీఎస్‌ ఏడో దశ కర్మాగారాన్ని గురువారం ఆయన సందర్శించారు. టీఎస్‌ జెన్‌కో డైరెక్టర్లు, కేటీపీఎస్‌ సీఈలతో సమావేశమయ్యారు. యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు అధిగమించాలన్నారు.