e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home తెలంగాణ రాన్సమ్‌వేర్‌కు చెక్‌ పెట్టండిలా

రాన్సమ్‌వేర్‌కు చెక్‌ పెట్టండిలా

  • సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల సూచనలు

హైదరాబాద్‌, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): మనకు తెలియకుండానే సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ అటాచ్‌మెంట్లు, లింక్‌లను పంపి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌, సర్వర్లలోకి చొరబడుతున్న ఘటనలు కోకొల్లలు. సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్‌ చేసి బిట్‌కాయిన్ల రూపంలో డబ్బులు డిమాండ్‌ చేస్తున్న కేసులను తరచూ వింటూనే ఉన్నాం. దీన్నే రాన్సమ్‌వేర్‌ అటాక్స్‌ అంటారు. వీటిబారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి అని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.
డాటా బ్యాకప్‌: రాన్సమ్‌వేర్‌ బారినపడ్డా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనుకుంటే మన డాటాను బ్యాకప్‌ చేసుకోవాలి. రాన్సమ్‌వేర్‌ పంపి మన డాటాను ఎన్‌క్రిప్ట్‌ చేసినా బ్యాకప్‌తో సేవ్‌ అవ్వొచ్చు.
అనుమానాస్పద లింక్‌లు ఓపెన్‌ చేయవద్దు: చాలావరకు రాన్సమ్‌వేర్‌ దాడుల్లో లింక్‌లు, అటాచ్‌మెంట్లను పంపి చేసేవే. అందుకే అనుమానాస్పద లింక్‌లు, అటాచ్‌మెంట్లను తెరువొద్దు.
అప్‌డేటెడ్‌ యాంటివైరస్‌ తప్పనిసరి: కంప్యూటర్‌లో అప్‌డేటెడ్‌ యాంటివైరస్‌ను తప్పక పెట్టుకోవాలి.
సైబర్‌ సెక్యూరిటీ పాలసీ: యూజర్‌ యాక్సెస్‌ కంట్రోల్‌, పాస్‌వర్డ్‌ మేనేజ్‌మెంట్‌, సోషల్‌ మీడియా రూల్స్‌పై అవగాహన కలిగి ఉండాలి.
ఇన్సిడెంట్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌: సైబర్‌ ఎటాక్‌ జరిగితే ఎలా డాటా రికవరీ చేసుకోవాలన్నదానికి ఒక ముందస్తు ఎమర్జెన్సీ రివకరీ ప్లాన్‌ తప్పనిసరి.
సైబర్‌ సెక్యూరిటీపై శిక్షణ: కంపెనీ లేదా సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ సైబర్‌ సెక్యూరిటీ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించాలి. దీనివల్ల సైబర్‌ దాడులు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా ఎదుర్కొవాలి అన్నది తెలుస్తుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana