శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 17:38:25

త్వరలోనే రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

త్వరలోనే రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి : మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని ఇదేవిధంగా త్వరలోనే రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, కలెక్టర్‌ అనుయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో వ్యవసాయం పండగలా మారిందని తెలిపారు. తెలంగాణ రైతులు దేశానికి అన్నంపెట్టేస్థాయికి ఎదిగారన్నారు. సంక్షేమరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కోన్నారు.logo