మంగళవారం 14 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 15:36:13

ఆధునిక వసతులతో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం

ఆధునిక వసతులతో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం

రంగారెడ్డి : జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆధునికంగా అన్ని రకాల సదుపాయాల తో నిర్మించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  పేర్కొన్నారు. జిల్లా నూతన జిల్లా గ్రంథాలయ భవనానికి బడాంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలో ఎంపీ రంజిత్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ తో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రంథాలయల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వికారాబాద్ లో జిల్లా కేంద్ర లైబ్రరీ ఉండేదని, జిల్లాల పునర్విభజనతో కేంద్ర లైబ్రరీని అన్ని నియోజకవర్గాలకు మధ్యలో ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. 4 కోట్ల రూపాయల నిధులతో సిరిసిల్లలో నిర్మించినట్లు జిల్లా లైబ్రరీని నిర్మిస్తామన్నారు. జిల్లాలోని చేవెళ్ల, శంషాబాద్, శేరిలింగంపల్లి లలో కూడా అన్ని వసతులతో కూడిన లైబ్రరీ లను నిర్మిస్తామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత,విద్యార్థులు చిన్న పిల్లలు,పెద్దలు చదివే అన్ని రకాల పుస్తకాలు లైబ్రరీ లలో అందుబాటులో ఉంటాయని ,వీటిని వినియోగించుకోవలన్నారు.


 పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారి కోసం ఈ లైబ్రరీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగ రెడ్డి ,బడాంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo