శనివారం 30 మే 2020
Telangana - Apr 30, 2020 , 21:44:14

రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ మూడో పంపు ప్రారంభం

రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ మూడో పంపు ప్రారంభం

సిద్దిపేట : రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ మూడవ పంపు సెట్‌ను మంత్రి హరీశ్‌రావు గురువారం స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. చిన్నకోడూరు మండలం సంధులపూర్‌ వద్ద మంత్రి పంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆనంద్‌, ఇరిగేషన్‌ అధికారిక సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... అతి త్వరలోనే మల్లన్నసాగర్‌ పంప్‌హౌస్‌కు నీళ్లు విడుదల చేస్తామన్నారు. రంగనాయక సాగర్‌ ద్వారా ఎడమ, కుడి కాల్వలకు త్వరలోనే నీళ్లు వస్తాయని పేర్కొన్నారు.logo