శనివారం 06 జూన్ 2020
Telangana - May 14, 2020 , 20:07:18

రంగనాయక సాగర్‌ కుడి కాల్వ ధ్వంసం.. ఐదుగురిపై కేసు..

రంగనాయక సాగర్‌ కుడి కాల్వ ధ్వంసం.. ఐదుగురిపై కేసు..

సిద్దిపేట: రంగనాయకసాగర్‌ కుడి కాల్వను ధ్వంసం చేసిన సంఘటనలో ఐదుగురిని అరెస్టు చేసి జ్యూడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు పోలీసు అధికారులు. నంగునూరు మండలం పాలమాకుల చెరువులోకి నీరు రావడం కోసం గ్రామానికి చెందిన గుల్ల మల్లయ్య, చామంతుల నర్సింలు, పారుపల్లి యాదయ్య, గుడిపల్లి మల్లేశం, బస్వరాజు రాములు కలిసి ముండ్రాయి గ్రామ శివారులో గోదావరి జలాలు పారుతున్న కుడి కాల్వను ధ్వంసం చేశారు. నీటి పారుదల శాఖ అధికారి చంద్రశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినట్లు స్థానిక ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు. వారికి సంబంధించిన నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించి కాల్వల ద్వారా రైతులకు సాగునీరందిస్తుందన్నారు. అక్రమంగా కాల్వలను ఎవరు ధ్వంసం చేసిన చర్యలు తప్పవన్నారు. 


logo