గురువారం 04 జూన్ 2020
Telangana - May 01, 2020 , 01:56:27

రంగనాయకసాగర్‌ 3వ మోటర్‌ ప్రారంభం

రంగనాయకసాగర్‌ 3వ మోటర్‌ ప్రారంభం

  • రెండురోజుల్లో కాల్వలకు నీళ్లు
  • ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

చిన్నకోడూరు: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో భాగంగా గురువారం రాత్రి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సర్జ్‌పూల్‌లోని 3వ మోటర్‌ను ప్రారంభించారు. ఈ మోటర్‌ను ప్రారంభించగానే గోదావరి జలాలు పెద్దఎత్తున రిజర్వాయర్‌లోకి ఎగిసిపడ్డాయి. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రెండురోజుల్లో రంగనాయకసాగర్‌ కుడి, ఎడుమ కాల్వలకు నీళ్లు విడుదలచేస్తామని చెప్పారు. మోటర్‌ విజయవంతంగా నడుస్తుండటంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ విజయసంకేతం చూపారు. అంతకుముందు సర్జ్‌పూల్‌ను సందర్శించిన మంత్రి.. నియోజకవర్గంలో ఏయే చెరువులు, కుంటలు, వాగులు ముందుగా నిండనున్నాయనే అంశాలపై సమీక్షించారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి 0.5 టీఎంసీల నీళ్లు చేరినట్టు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఎస్‌ఈ ఆనంద్‌, మెగా ప్రతినిధి ఉమామహేశ్వర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు వేలేటి రాధాకృష్ణశర్మ, శ్రీకాంత్‌రెడ్డి, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పొల్గొన్నారు.logo