బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 01:23:04

ఎస్సీ వర్గీకరణ సాధ్యంకాదు

 ఎస్సీ వర్గీకరణ సాధ్యంకాదు

  • కేంద్ర సహాయ మంత్రి రాందాస్‌ అథావలే

హైదరాబాద్‌, జనవరి 9 (నమస్తే తెలంగా ణ): ఎస్సీల్లో మాదిగలు చేస్తున్న ఏ,బీ,సీ,డీ వర్గీ కరణ సరైన డిమాండే అయినప్పటికీ అది సాధ్యం కాదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతశాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథావలే స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా ఎస్సీ ల్లో 1,264 ఉపకులాలు ఉన్నాయని, వర్గీక రణను సుప్రీంకోర్టు సైతం అంగీకరించడం లేదన్నారు. శనివారం బేగంపేటలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని తాము కేంద్ర ప్రభు త్వానికి సైతం విన్నవించామని, తెలంగాణ లోనూ ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఉపకార వేతనాల్లో కేంద్ర కోటా 80%వరకు ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. వ్యవసాయ చట్టాలకు సవరణలు చేసేందుకు కేంద్రం సుముఖంగానే ఉన్నదన్నారు.

కేసీఆర్‌ మంచి మిత్రుడు

సీఎం కేసీఆర్‌ తనకు మంచి మిత్రుడని, కేసీఆర్‌తో కలిసి 2004లో తెలంగాణ ఉద్యమ సభలోనూ తాను పాల్గొన్నట్టు అథావలే గుర్తుచేశారు. తన పార్టీ ఆర్పీఐ తరఫున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు మద్దతు తెలిపానని చెప్పారు. 


logo