మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 20, 2020 , 19:19:19

రామప్ప, మేడారం ఆలయాల్లో దర్శనాలు రద్దు

రామప్ప,  మేడారం  ఆలయాల్లో దర్శనాలు రద్దు

వరంగల్‌: కరోనా వైరస్‌ ప్రభావం ఆలయాలపైనా పడింది.  కరోనా వైరస్‌ కట్టడి నేపథ్యంలో ములుగు జిల్లాలోని రామప్ప, మల్లూరు ఆలయాలు, మేడారం జాతరలో భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు రామప్ప ఆలయ ఈవో రాచకొండ శ్రీనివాస్‌, మేడారం జాతర ఇంచార్జ్‌ ఈవో రాజేంద్రం, మంగపేట ఆలయ బాధ్యులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, దేవాదాయ శాఖ ఆదేశాలతో ఈ నెల 31వ తేదీ వరకు సేవలను నిలిపివేస్తున్నట్లు వారు చెప్పారు.

నిత్యం ఉదయం జరిగే అభిషేకం, నైవేద్య వితరణ కార్యక్రమాలు యథాతథంగానే కొనసాగాతాయని పేర్కొన్నారు.  వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా భక్తులకు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలతో యాదాద్రి పుణ్యక్షేత్రంతో పాటు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం నుంచి మూసివేశారు. 


logo
>>>>>>