సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 11:42:45

ఎంపీ సంతోష్‌కుమార్‌ కృషి అభినందనీయం : రామజోగయ్య శాస్త్రి

ఎంపీ సంతోష్‌కుమార్‌ కృషి అభినందనీయం : రామజోగయ్య శాస్త్రి

హైదరాబాద్‌ : గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ కృషి అభినందనీయమని సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ప్రశంసించారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆయన నేడు నగరంలోని మణికొండలో గల తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శాస్త్రి మాట్లాడుతూ... మొక్కలన్న, చెట్లన్న తనకు చాలా ఇష్టమన్నారు. పర్యావరణానికి మొక్కలు ఎంతగానో మేలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి మరో ముగ్గురికి గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు. సినీ కవి చంద్రబోస్‌, సంగీత దర్శకుడు థమన్‌, సినీ హీరో రాజ్‌ తరుణ్‌లను తన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఛాలెంజ్‌ ప్రతినిధి, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఫౌండేషన్‌ నిర్వాహాకులు సుబ్బరాజు పాల్గొన్నారు.

logo