ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 13:16:13

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లతో ర్యాలీ

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లతో ర్యాలీ

ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలంలో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో మండలంలోని రైతులు నాలుగు వందల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి ఉత్సవం నిర్వహించారు. నూతన రెవెన్యూ చట్టం రైతులకు అనేక ప్రయోజనాలు ప్రభుత్వం కల్పించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా తాము ఎదుర్కొంటున్న భూ సమస్యలకు నూతన రెవెన్యూ చట్టం పరిష్కారం చూపుతుందని రైతులు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సమస్యలను ప్రధానంగా గుర్తించి వాటి పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు అద్వితీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. రైతు బంధు, మిషన్ కాకతీయ తదితర కార్యక్రమాల ద్వారా రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాట పడుతున్నారని కొనియాడారు. అనంతరం రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.logo