సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 21:11:47

ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్ : మంత్రి హరీశ్‌రావు

ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్ : మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌ : రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల  అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని పేర్కొన్నారు. అనుబంధానికి, ఆప్యాయతకు చిహ్నంగా నిలిచే రాఖీ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలన్నారు. కరోనా నేపథ్యంలో స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని సూచించారు. ‘నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష అన్నభావనే లోకానికి రక్ష’ అని చాటేలా సోదర,  సోదరీమణులు మాస్కులు ధరించి, శానిటైజర్లు ఉపయోగించి, భౌతిక దూరం పాటిస్తూ ఆత్మీయ రక్షణతో రాఖీ పౌర్ణమి జరుపుకొని అనుబంధాన్ని చాటాలని కోరారు.


logo