శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:10

కార్గోలో రాఖీల రవాణా

కార్గోలో రాఖీల రవాణా

  • సరుకు రవాణాలో ఆర్టీసీ దూకుడు
  • నెల రోజుల్లోనే రూ.5.30 లక్షల ఆదాయం

నల్లగొండ: కార్గో సేవల్లో ఆర్టీసీ విశేష ఆదరణ పొందుతున్నది. సరుకు రవాణాలో దూసుకుపోతున్నది. అనతికాలంలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ మెరుగైన ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు కార్గో సేవల రంగంలోకి అడుగుపెట్టిన ఆర్టీసీ. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత నెల 19న సేవలు ప్రారంభించింది. తొలి రోజున రూ.వెయ్యి ఆదాయంతో మొదలైన వ్యాపారం ప్రస్తుతం రోజుకు రూ.20 వేలకుపైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. ఆర్టీసీ సిబ్బంది పట్టణాల్లోని దుకాణాల యజమానులను కలుస్తూ తమ సంస్థ సేవల గురించి వివరించే పనిలో పడ్డారు. గడిచిన నెల రోజుల్లో నల్లగొండ జిల్లాలో రూ.3,79,758, సూర్యాపేట జిల్లాలో రూ.1.5 లక్షల ఆదాయాన్ని సముపార్జించింది.

ఆర్టీసీ కార్గోలో రాఖీలు రవాణా..

నల్లగొండ సిటీ: త్వరలో వచ్చే రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా రాఖీలను సైతం పంపిస్తామని ఆర్టీసీ నల్లగొండ ఆర్‌ఎం వెంకన్న తెలిపారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆరు కార్గో సర్వీసు పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు హాలియా, కొండమల్లేపల్లి, దేవరకొండ, నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లోని కార్గో సర్వీస్‌ సెంటర్స్‌లో సంప్రదించాలన్నారు. అదే విధంగా ఫోన్‌లో అయితే నల్లగొండ బస్టాండ్‌ 8333908055, హాలియా 8333908056, హయత్‌నగర్‌ 7382839899, ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌ను 98851 99068 నంబర్‌లో సంప్రదించాలని ఆర్‌ఎం కోరారు.


logo