మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 18:23:06

రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు : మంత్రి సత్యవతి రాథోడ్

రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు : మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ : సోదర, సోదరీమణులు ఒకరికొకరు అండగా, ఆప్యాయతలు పంచుకుకొని చేసుకునే పండుగ రాఖీ పౌర్ణమి. సమాజంలో సోదర భావాన్ని పెంపొందించి ప్రేమానుబంధాల్ని పెంచే రాఖీపండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. బాలికలు, మహిళలు సమాజంలోని పురుషులు తమకు ధైర్యంగా మారాలని, పెట్టని కోటవలె రక్షణగా నిలవాలని కోరుకుంటారన్నారు. మహిళా – శిశు సంక్షేమానికి సీఎం కేసిఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ పెట్టారని తెలిపారు.

సఖీ సెంటర్లు పటిష్టంగా నిర్వహిస్తున్నారని, స్త్రీల భద్రతలో ఎక్కడా రాజీ పడడం లేదన్నారు. అదేవిధంగా అంగన్ వాడీల ద్వారా మహిళలు, శిశువుల ఆరోగ్యం, అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. అప్యాయతలు, అనురాగాలతో అన్నా, చెల్లెల్లు, అక్కా, తమ్ముళ్లు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. logo