గురువారం 28 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 01:38:18

కోలుకున్న రజినీ

కోలుకున్న రజినీ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రముఖ సినీనటుడు రజినీకాంత్‌ (70) అనారోగ్యం నుంచి కోలుకొన్నారు. ఆదివారం మధ్యాహ్నం హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. తమిళ సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్‌ కోసం ఈ నెల 13న హైదరాబాద్‌ వచ్చిన రజినీకాంత్‌ రక్తపోటు సమస్యతో ఈ నెల 25 ఉదయం జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రజినీకాంత్‌కు రక్తపోటు అదుపులోకి రావడంతో ఆయన పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. వారం పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. గతంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్న రజినీ వయసురీత్యా, కరోనాను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం మంచిదని కోరారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతికోసం రజినీ తిరిగి చెన్నై వెళ్లారు. మరోవైపు ఈ నెల 31 రాజకీయ అరంగేట్ర ప్రకటన చేస్తానని రజనీ ఇదివరకే ప్రకటించారు. తాజా పరిస్థితుల దృష్ట్యా పార్టీ ప్రకటనలో కూడా జాప్యం జరుగవచ్చునని తెలుస్తున్నది.


logo