మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 14, 2020 , 06:20:13

జీహెచ్‌ఎంసీ నూతన స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా రాజేంద్ర ప్రసాద్‌

జీహెచ్‌ఎంసీ నూతన స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా రాజేంద్ర ప్రసాద్‌

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొనే చిన్నారులను యావత్‌ భారత్‌లోనే మొదటి స్థానంలో నిలిపే విధంగా కృషి చేస్తానని నూతనంగా జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన బి.రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొనే చిన్నారులకు అధునాతనమైన శిక్షణ ఇవ్వడంతోపాటు అత్యుత్తములుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాతీయ వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో రాణించిన ఆయన హైదరాబాద్‌ నగర పాలక సంస్థలో కోచ్‌గా 1987లో బాధ్యతలు స్వీకరించి అంచలంచలుగా రాణించారు. 2002లో జోనల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చార్మినార్‌, సరూర్‌నగర్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, కాప్రా సర్కిళ్లలో పనిచేసిన ఆయన ప్రస్తుతం ఉప్పల్‌ జోనల్‌ క్రీడా డైరెక్టర్‌ ఉన్న రాజేంద్రప్రసాద్‌కు జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా అవకాశం లభించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


logo
>>>>>>