గురువారం 28 మే 2020
Telangana - May 04, 2020 , 10:48:33

రాజస్థాన్‌ వలస కూలీలకు తప్పిన ప్రమాదం

రాజస్థాన్‌ వలస కూలీలకు తప్పిన ప్రమాదం

నిజామాబాద్‌: రాజధాని హైదరాబాద్‌ నుంచి రాజస్థాన్‌ వెళ్తున్న వలస కూలీలు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌ జాతీయ రహదారి 44 వద్ద వారు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు సోమవారం తెల్లవారుజామున అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీక్కొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలవగా, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఎమ్మార్వో ఇలియాస్‌ అహ్మద్‌ వారికి స్థానిక పాఠశాలలో ఆశ్రయం కల్పించి, అల్పాహారం అందించారు. అధికారులు ప్రత్యామ్నాయంగా మరో బస్సును ఏర్పాటు చేసి కూలీలను తరలించారు. లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వలస కూలీలు వారి స్వస్థలాలకు వెల్లడానికి ప్రభుత్వం అనుమతివ్వడంతో సొంత రాష్ర్టాలకు బయల్దేరుతున్నారు కూలీలు. కొందరు రైళ్లలో వెళ్తుండగా, మరికొందరు ప్రైవేట్‌ వాహనాల్లో తరలి వెళ్తున్నారు. 


logo