మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 16:33:06

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే దాతృత్వం

 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే దాతృత్వం

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ  రాహుల్ హెగ్డే  సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు.   కొద్దిరోజుల క్రితం  జిల్లా కేంద్రం సిరిసిల్లలో తల్లిదండ్రులు చనిపోయి ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారన్న విషయాన్ని   తెలుసుకున్న ఎస్పీ వారిని అన్ని విధాలా ఆదుకున్నారు.  వారికి   స్వయంగా   ఇల్లు కట్టించి ఇచ్చి ఆ అనాథలకు   ఆశ్రయం కల్పించారు. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర  డీజీపీ   మహేందర్ రెడ్డి    ఎస్పీ  హెగ్డేను అభినందించారు. 

తాజాగా సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మ్యాకల లక్ష్మి, రామయ్యల పెద్ద కొడుకు రాహుల్ (27) అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న  విషయాన్ని తెలుసుకున్న   రాహుల్   ఆ కుటుంబానికి  50వేల నగదును అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.     3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు. హైదరాబాద్ లోని కొందరు  డాక్టర్‌లతో   మాట్లాడి మంచి వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చి, వెంటనే హైదరాబాద్ లో ఆస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు.  

VIDEOS

logo