మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 20:41:39

రాజంపేట తహసీల్దార్ సస్పెన్షన్

రాజంపేట తహసీల్దార్ సస్పెన్షన్

కామారెడ్డి : జిల్లా రాజంపేట మండలం తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని షేర్ శంకర్ తండాలో సర్వేనెంబర్ 278, 279లో ఐదుగురు వ్యక్తులకు అక్రమంగా పట్టాదారు పాసు బుక్కులు జారీ చేసిన కారణంగా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తండా వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉన్నత అధికారులు జరిపిన విచారణలో తహసీల్దార్ మోతి సింగ్ అక్రమంగా పట్టాలు చేసినట్లుగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఐదు పాస్ బుక్కులను రద్దు చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి..

గండిచెరువుకు లక్ష్మీ పుష్కరిణిగా నామకరణం

సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్‌ చేసిన సీపీ 

హ్యాండ్ షేక్‌తో ఏమవుతుందో తెలుసా..? 

దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

అస‌లు క్యాపిట‌ల్ హిల్ అంటే ఏంటో తెలుసా?