శనివారం 04 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 14:39:57

కాసుపల్లి రైతులకు రైతుబంధు

కాసుపల్లి రైతులకు రైతుబంధు

హైదరాబాద్‌ : పెద్దపల్లి జిల్లా కాసులపల్లి రైతులకు రైతుబంధు పథకం వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జనవరి 23న సీసీఎల్‌ఏ ఇచ్చిన వివరాల్లోని ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాదారులకు పథకం వర్తింపజేయనున్నట్లు పేర్కొంది. కాసులపల్లిలో సుమారు 621 మంది రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకుంటుండగా ఈ సారి రైతుబంధు ఇస్తామని, ఏడాదిలో ఒకే సారి పరిగణలోకి తీసుకోనున్నట్లు చెప్పింది. ప్రతి సీజన్‌కు ముందు భూముల లావాదేవీలను పరిశీలించడంతో పాటు, అమ్మిన భూముల వివరాలు జాబితా నుంచి తొలగించున్నట్లు పేర్కొంది. కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో దశలవారీగా పెట్టుబడి ఇస్తామని, ఇందులో తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించింది. కాగా, రైతుబంధు పథకం అమలు కోసం రాష్ట్ర, జిల్లాస్థాయిలో కమిటీలు వేసినట్లు తెలిపింది. రైతుబంధు వదులుకునే వారు ‘గివ్‌ ఇట్‌ అప్‌’ ఫారం ఇవ్వాలి కోరంది. వదులుకున్న మొత్తాన్ని రైతుబంధు సమితి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


logo