గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 19:02:24

ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన పెంచుకోవాలి

ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన పెంచుకోవాలి

యాదాద్రి భువనగిరి : వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని, రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. రాచకొండ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణ పరిధి లోని సింగన్న గూడెం చౌరస్తా భువనగిరి- వరంగల్ హైవే రోడ్డు మార్గంలో ప్రమాదాలను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన స్పీడ్ లిమిట్ డిజిటల్ డిస్ ప్లే బోర్డును సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ..వాహనదారులు స్వీడ్ లిమిట్ దాటడంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 

వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి అధిక స్వీడ్ లిమిట్ దాటితే స్వీడ్ మీటర్ ద్వారా ఆ వాహన యజమానికి చలాన్ మెసేజ్ వెళ్తుందన్నారు. వాహన దారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉండాలన్నారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు తగ్గుతాయని, సీటు బెల్టు ధరించాలని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్, డీసీపీ నారాయణ రెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo