హైదరాబాద్ : విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. గోవాకు దక్షిణ నైరుతి దిశగా 330 కిలోమీటర్ల దూరంలో తౌక్తే తుపాను కేంద్రీకృతమైంది. రాగల 6 గంటల్లో తౌక్తే తుపాను తీవ్ర తుపానుగా మారనుంది. తదుపరి 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి తౌక్తే తుపాను మరింత బలపడనుంది. ఈ నెల 18న మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 8:30 గంటల మధ్య గుజరాత్ వద్ద తౌక్తే తుపాను తీరం దాటనుంది.
తౌక్తే తుపాను నేపథ్యంలో ఇవాళ, రేపు రాష్ర్టంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇవాళ దక్షిణ తెలంగాణ జిల్లాలపై, రేపు పశ్చిమ తెలంగాణ జిల్లాలపై వర్షం ప్రభావం ఉండనుంది.