హైదరాబాద్ : మరో మూడు రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో రాగల ఐదు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షం పడనుందని తెలిపారు.