హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం తెలిపింది. గత నాలుగైదు రోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్న విషయం తెలిసిందే.