మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 07:26:28

నేడు, రేపు అక్క‌డ‌క్కడ వర్షాలు

నేడు, రేపు అక్క‌డ‌క్కడ వర్షాలు

హైద‌రా‌బాద్‌: రాష్ట్రంలో చలి‌గా‌లులు వీస్తు‌న్నాయి. అల్ప‌పీ‌డన ద్రోణి వల్ల బుధ, గురు‌వా‌రాల్లో ఒకటి రెండు‌చోట్ల తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవ‌కాశం ఉన్న‌దని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. కర్ణా‌టక తీరం వద్ద తూర్పు అరే‌బి‌యన్‌ సముద్రం నుంచి దక్షిణ కొంకణి, గోవా వీదుగా దక్షిణ మధ్య మహా‌రాష్ర్ట వరకు తూర్పు గాలు‌లతో 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు అల్ప‌పీ‌డన ద్రోణి ఏర్ప‌డిం‌దని పేర్కొ‌న్నది. రాష్ర్టా‌నికి ప్రధా‌నంగా ఆగ్నేయ, దక్షిణ దిశ‌నుంచి గాలులు వీస్తు‌న్నా‌యని తెలి‌పింది. పొడి వాతా‌వ‌రణం నెల‌కొ‌న్న‌దని పేర్కొ‌న్నది. మంగ‌ళ‌వారం రాష్ర్టంలో అతి తక్కు‌వగా సంగా‌రెడ్డి జిల్లా కోహి‌ర్‌లో 10.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైం‌దని టీఎ‌స్‌‌డీ‌పీ‌ఎస్‌ వెల్ల‌డిం‌చింది. మరో‌వైపు హైద‌రా‌బా‌ద్‌లో 18.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత రికా‌ర్డ‌యింది.


logo