బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 17:06:35

రాష్ట్రంలో మ‌రో 3 రోజుల పాటు వ‌ర్షాలు!

 రాష్ట్రంలో మ‌రో 3 రోజుల పాటు వ‌ర్షాలు!

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో మ‌రో 3 రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఉత్త‌ర కోస్తాంధ్ర‌, ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం మ‌రో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. రాగ‌ల 24 గంట‌ల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం బ‌ల‌పడే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో రేపు, ఎల్లుండి అనేక చోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు, కొన్ని జిల్లాల్లో ఒక‌ట్రెండు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. logo