శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 06:28:43

నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌ : ఛత్తీస్‌గఢ్‌, ఇంటీరియర్‌ ఒడిశా ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు కాస్త నెమ్మదించినట్టు చెప్పారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు వనపర్తి, నల్లగొండలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం, మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 6 సెం.మీ. చొప్పున, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, సిద్దిపేట జిల్లా నంగనూరులో 5 సెం.మీ.చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు.


logo