e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో వానలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో వానలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో వానలు

హైదరాబాద్‌: అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. వరంగల్‌, హన్మకొండ, కాజీపేటలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమవగా, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నర్సంపేట, పరకాల డివిజన్లు, ధర్మసాగర్‌, వేలేరు మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మహబూబాబాద్‌ జిల్లాలోని గూడూరు, కొత్తగూడెం, గంగారం మండలాల్లో వాన పడుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, టేకులపల్లి, గండాల, ఆళ్లపల్లి మండలాల్లో, ఖమ్మం జిల్లావ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది.
ఆదివారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అత్యధికంగా 14.9 సెంటీమీటర్లు, కుమ్మెరలో 14.6 సెం.మీ., నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో 11.4, ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండలో 10, కరీంనగర్‌ జిల్లా తాడికల్‌లో 8.85 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో వానలు

బంగాళాకాతంలో అల్పపీడం..

కాగా, పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడింది. దీనిప్రభావంతో రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లండి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

‘కోపా అమెరికా’ విజేత అర్జెంటీనా
దేశంలో కొత్తగా 41 వేల కరోనా కేసులు
‘వ‌ర్జిన్‌ గెలా‌క్టిక్‌’.. నేడు రోదసీలోకి తెలుగమ్మాయి
తాలిబ‌న్ ఎఫెక్ట్‌.. ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి 50 మంది భార‌త అధికారులు వెన‌క్కి
దిగివ‌చ్చిన ట్విట‌ర్‌.. ఫిర్యాదు అధికారిగా విన‌య్ ప్ర‌కాశ్ నియామ‌కం
జమ్ములో ఎన్‌ఐఏ తనిఖీలు.. ఐదుగురు అరెస్టు
కేరళలో మరో జికా వైరస్‌ కేసు.. 15కు చేరిన బాధితులు
- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో వానలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో వానలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో వానలు

ట్రెండింగ్‌

Advertisement