ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 27, 2020 , 06:51:53

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పలుచోట్ల శుక్ర, శనివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి ఆగ్నేయ రాజస్థాన్‌ వర కు ఏర్పడిన ఉపరితల ద్రోణి.. ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడ్డాయని పేర్కొన్నది. తెలంగాణలో ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులు ప్రభావంతో రెండ్రోజులు అక్కడక్కడా వర్షాలు కురువొచ్చని వెల్లడించింది. గురువారం ఆదిలాబాద్‌ జిల్లా తాలమడుగులో 25.4 మిల్లీమీటర్ల వర్షంపడ గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారంలో అత్యధికంగా 39.4 డిగ్రీల గరి ష్ఠ ఉష్ణోగ్రత రికార్డయిందని తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ తెలిపింది. హైదరాబాద్‌ పరిధిలోని పాశమైలారంలో 37.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నది.


logo