బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 06:52:12

మరో మూడు‌రో‌జులు వాన‌లు

మరో మూడు‌రో‌జులు వాన‌లు

హైద‌రా‌బాద్: వాయవ్య బంగా‌ళా‌ఖా‌తంలో ఏర్ప‌డిన అల్ప‌పీ‌డనం వల్ల రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు పడ‌ను‌న్నాయి. ఉత్తర ఆంధ్ర, ఒడిశా తీరా‌లకు దగ్గ‌రలో వాయవ్య బంగా‌ళా‌ఖాతం, దానికి ఆను‌కున్న పశ్చి‌మ‌మధ్య బంగా‌ళా‌ఖా‌తంలో ఉప‌రి‌తల ఆవ‌ర్తనం వల్ల వాయవ్య బంగా‌ళా‌ఖా‌తంలో గురు‌వారం అల్ప‌పీ‌డనం ఏర్ప‌డింది. దీంతో మూడు రోజు‌ల‌పాటు అక్క‌డ‌క్కడ తేలి‌క‌పాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు పడే అవ‌కాశం ఉన్న‌దని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలిపింది. ఆది‌లా‌బాద్‌, నిర్మల్‌, కుమ్రం భీం ఆసి‌ఫా‌బాద్‌, మంచి‌ర్యాల, నిజా‌మా‌బాద్‌, జగి‌త్యాల, రాజన్న సిరి‌సిల్ల, పెద్ద‌పల్లి, కరీం‌న‌గర్‌, జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి, భద్రాద్రి కొత్త‌గూడెం, ములుగు, వరం‌గల్‌, మహ‌బూ‌బా‌బాద్‌, ఖమ్మం, నల్ల‌గొండ, సూ ర్యా‌పేట జిల్లాల్లో శుక్ర‌వారం ఒకటి, రెండు‌చోట్ల భారీ నుంచి అతిభారీ వానలు పడుతాయని పేర్కొన్నది. 

తాజావార్తలు


logo