బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 06:58:35

కొన‌సా‌గు‌తున్న అల్ప‌పీ‌డన ద్రోణి.. నేడు, రేపు వాన‌లు

కొన‌సా‌గు‌తున్న అల్ప‌పీ‌డన ద్రోణి.. నేడు, రేపు వాన‌లు

హైద‌రా‌బాద్: ఛత్తీ‌స్‌‌గఢ్‌ నుంచి దక్షిణ తమి‌ళ‌నాడు వరకు తెలం‌గాణ, కోస్తా ఆంధ్రా మీదుగా అల్ప‌పీ‌డన ద్రోణి కొన‌సా‌గు‌తు‌న్నది. దీని ప్రభా‌వంతో రాష్ట్రంలో నైరుతి రుతు‌ప‌వ‌నాలు చురుగ్గా కదు‌లు‌తు‌న్నట్లు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. నేడు, రేపు రాష్ట్ర‌వ్యా‌ప్తంగా చాలా‌ప్రాం‌తాల్లో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన వర్షాలు కురు‌స్తా‌యని, అక్క‌డ‌క్కడ భారీ వానలు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని వెల్ల‌డించారు. 

బుధ‌వారం ఉదయం నుంచి గురు‌వారం ఉదయం 8–30 గంటల వరకు రాష్ట్రంలో అత్య‌ధికంగా ఆది‌లా‌బాద్‌ జిల్లా తల‌మ‌డు‌గులో 10 సెంటీ‌మీ‌టర్ల వర్ష‌పాతం నమో‌దైంది. వికా‌రా‌బాద్‌ జిల్లా మోమి‌న్‌‌పే‌ట్‌లో, మెద‌క్‌లో, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రామ‌న్న‌పే‌టలో, జన‌గామ జిల్లా నర్మె‌టలో, ఆది‌లా‌బాద్‌ జిల్లా థాంసిలో 9 సెంటీ‌మీ‌టర్ల చొప్పున వర్షం నమో‌దై‌నట్లు వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది.


logo