గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 06:59:18

రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో భారీ వానలు

రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో భారీ వానలు

హైద‌రా‌బాద్: రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో నేడు, రేపు భారీ వానలు కురిసే అవ‌కాశం ఉన్న‌ది. ఉత్తర కర్ణా‌టక నుంచి దక్షిణ తమి‌ళ‌నాడు వరకు 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌దాకా ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్ప‌డింది. దీని ప్రభా‌వంతో సోమ, మంగ‌ళ‌వా‌రాల్లో అక్క‌డ‌క్కడ ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలిపింది.

హైద‌రా‌బాద్‌, రంగా‌రెడ్డి, ఉమ్మడి మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నల్ల‌గొండ, ఆది‌లా‌బాద్‌, నిజా‌మా‌బాద్‌ జిల్లాల్లో ఒకటి రెండు‌చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌దని వెల్ల‌డించింది. గ్రేటర్‌ హైద‌రా‌బా‌ద్‌లో వ‌చ్చే మూడురోజులు సాధార‌ణం నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని తెలిపింది. 


logo