గురువారం 04 జూన్ 2020
Telangana - May 13, 2020 , 00:47:36

మరో మూడ్రోజులు వానలు

మరో మూడ్రోజులు వానలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాబోయే మూడు రోజుల వరకు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్యప్రదేశ్‌ నుంచి మరాఠ్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. దక్షిణ అం డమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో మధ్యస్థ ట్రోపోస్పియర్‌ స్థాయిల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. వీటి ప్రభావం వల్ల ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న అండమాన్‌ ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. తర్వాత అది మరింత బలపడనున్నది. మంగళవారం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతోపాటు రాజన్నసిరిసిల్ల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షం కురిసింది.


logo