శనివారం 30 మే 2020
Telangana - May 01, 2020 , 14:51:49

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌ : నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌, మలక్‌పేట, కొత్తపేట్‌, సైదాబాద్‌, చంపాపేట్‌, సంతోష్‌నగర్‌, మాదన్నపేట్‌, ఉప్పల్‌, పాతబస్తీ బహదూర్‌పురా, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో వచ్చే 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


logo