మంగళవారం 26 మే 2020
Telangana - Apr 30, 2020 , 22:24:29

భద్రాద్రి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం

భద్రాద్రి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం

భద్రాది కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కొత్తగూడెం, సుజాతనగర్‌, జూలూరుపాడు, పాల్వంచ, అశ్వారావుపేట, ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో ఈదురుగాలులతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షం పడింది. పలు గ్రామాల్లో ఇంటిపై ఉన్న రేకులు మొత్తం ఎగిరిపోయాయి. గోడలు, పూరిళ్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. రోడ్ల వెంబడి చెట్లు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా రైతులు పట్టాలు కప్పి కాపాడుకున్నారు. logo