మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 18:17:31

తెలంగాణ‌లో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు!

తెలంగాణ‌లో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు!

హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం విదిత‌మే. రాబోయే మూడు రోజుల పాటు కూడా తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారి రాజారావు వెల్ల‌డించారు. ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. ఉత్త‌ర బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో రాష్ర్టంలోని ప‌లు ప్రాంతాల్లో ఆది, సోమ‌వారాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌న్నారు. 

ఇప్ప‌టికే రాష్ర్టంలో చాలా చోట్ల వ‌ర్షాలు విస్తారంగా కురుస్తుండ‌డంతో చెరువుల‌కు, కుంట‌ల‌కు జ‌ల‌క‌ళ వ‌చ్చింది. కొన్ని ప్రాంతాల్లో చెరువులు అలుగు పారుతున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తూ పంట‌లు వేస్తున్నారు. 

ఏపీలో కూడా మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌న ద్రోణీతో పాటు ఉత్త‌ర బంగాళాఖాతంలో ఆగ‌స్టు 4న అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉండ‌డంతో ఏపీ వ్యాప్తంగా మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. 


logo