మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 08:56:59

పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

హైదరాబాద్ : ఆగ్నేయ బంగా‌ళా‌ఖా‌తంలో ఏర్ప‌డిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ప్రభా‌వంతో రాష్ట్రం‌లోని పలు జిల్లాల్లో గురు, శుక్ర‌వా‌రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నది. ప్రధా‌నంగా కామా‌రెడ్డి, జన‌గామ, సంగా‌రెడ్డి, మెదక్‌, కుమ్రం భీం ఆసి‌ఫా‌బాద్‌, జోగు‌ళాంబ గద్వాల, జగి‌త్యాల, నిర్మల్‌, భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో అక్క‌డ‌క్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురు‌వొ‌చ్చని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి రాజా‌రావు తెలి‌పారు. బుధ‌వారం రాష్ట్రంలో అత్య‌ధి‌కంగా కామా‌రెడ్డి జిల్లా నాగి‌రె‌డ్డి‌పే‌ట్‌లో 11 సెంటీ‌మీ‌టర్ల వర్ష‌పాతం నమో‌దైనట్టు పేర్కొన్నారు. రుతుపవనా లకుతోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌ హైద రాబాద్‌లో బుధవారం పలుచోట్ల వర్షం కురిసింది. వచ్చే రెండోరోజుల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని రాజారావు వెల్లడించారు.


logo