బుధవారం 08 జూలై 2020
Telangana - Apr 18, 2020 , 22:22:13

రానున్న మూడు రోజులు తెలంగాణ వ‌ర్ష‌సూచ‌న‌

 రానున్న మూడు రోజులు తెలంగాణ వ‌ర్ష‌సూచ‌న‌

రాష్ట్రంలో రానున్న‌ మూడురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమ‌వారం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్త‌రు నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే మంగ‌ళ‌వారం కూడా ఓ మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉత్తర జార్ఖండ్‌ నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురవచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది.


logo