ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 02, 2020 , 06:51:26

రేపు పలుచోట్ల మోస్తరు వానలు

రేపు పలుచోట్ల మోస్తరు వానలు

హైద‌రా‌బాద్‌: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్నది. అది వచ్చే 12 గంటల్లో తుపానుగా బలపడనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాత్రి శ్రీలంక వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోకూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా చలితీవ్రత క్రమంగా పెరుగుతుందని పేర్కొంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వెల్లడించింది. జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని సూచించింది. 


logo