శనివారం 30 మే 2020
Telangana - Mar 28, 2020 , 16:55:10

రాగ‌ల మూడు రోజుల్లో రాష్ట్రానికి వ‌ర్ష‌సూచ‌న‌

రాగ‌ల మూడు రోజుల్లో రాష్ట్రానికి వ‌ర్ష‌సూచ‌న‌

రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్క‌డ‌క్క‌డ తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశముంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు సూచించారు. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ప‌లుచోట్లు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వాన‌లు ప‌డ‌వ‌చ్చ‌ని తెలిపారు.  ఉరుములు, మెరుపుల‌తో కూడిన వాన‌లు కుర‌వ‌చ్చ‌ని వెల్ల‌డించారు. అటు ఈ  వేసవి కాలంలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో శుక్ర‌వారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావ‌ర‌ణ శాఖ వివ‌రించింది. పగటి పూట ఎండలు దంచికొట్ట‌డంతో పాటు.. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరిగాయి. గాలిలో తేమ 34 శాతంగా నమోదైనట్లు  వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారుlogo