శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 02, 2020 , 01:33:35

మరో మూడు రోజులు వానలు

మరో మూడు రోజులు వానలు

  • అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. రాగల 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశమున్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అండమాన్‌, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశమున్నదని వివరించింది. ఇది మరింత బలపడి 5వ తేదీ నాటికి ఉత్తర వాయవ్యదిశగా ప్రయాణించే అవకాశమున్నది. మరోవైపు ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విద ర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మ రో మూడురోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన లు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని వివరించారు.  

పలుచోట్ల వానలు..

శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  తేలికపాటి వానలు కురిశాయి. మెదక్‌ పట్టణ శివారులో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద పనులు చేస్తున్న జేసుబాయ్‌(52)పై రేకులుపడగా తీవ్రంగా గాయపడి మరణించింది. వికారాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ తేలికపాటి వర్షం కురిసింది.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షా లు పడే అవకాశం ఉన్నదని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.  కోస్తా తీరం వెంట 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని,  సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీచేశారు.


logo