గురువారం 28 మే 2020
Telangana - May 08, 2020 , 16:59:56

అటు భానుడి భ‌గ‌భ‌గ‌.. ఇటు వరుణుడి బీభత్సం

 అటు భానుడి భ‌గ‌భ‌గ‌.. ఇటు వరుణుడి బీభత్సం

వాతావరణం మారుతోంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది.  పలు ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు న‌మోదవుతున్నాయి. ఎండల తీవ్రత మ‌రింత పెరిగే అవ‌కాశ‌మున్న‌ద‌ని.. కొన్ని ప్రాంతల్లో 47 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలుంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. అటు రాత్రిపూట సైతం 30 డిగ్రీలకు వ‌ర‌కు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  ఇంకా కొన్ని ప్రాంతాల్లో గాలిలో తేమ 30 శాతం వరకూ తగ్గడంతో పొడి వాతావరణం, ఉక్కపోతలు పెరిగాయి. మరోవైపు  ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వడగళ్ల వానలు చేతికొచ్చిన పంటను నాశనం చేస్తున్నాయి. మరో మూడు రోజులు ఉపరితల ఆవర్తన ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అటు ఏపీలో భారీ వ‌ర్షాలు కురిసేఅవ‌కాశ‌ముంది.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా మారి ఒకటి, రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 


logo